రఘువీరాపై టీడీపీ కార్యకర్తల దాడి | raghuveera reddy attacked by Kona villagers | Sakshi
Sakshi News home page

రఘువీరాపై టీడీపీ కార్యకర్తల దాడి

Sep 13 2015 12:49 PM | Updated on Aug 18 2018 9:13 PM

రఘువీరాపై టీడీపీ కార్యకర్తల దాడి - Sakshi

రఘువీరాపై టీడీపీ కార్యకర్తల దాడి

పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఆదివారం కోన గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది.

మచిలీపట్నం: పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి ఆదివారం కోన గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. బందరు పోర్టుకు తమ భూములు ఇవ్వమంటూ భీష్మించుకున్న కోన గ్రామస్తులకు మద్దతు తెలిపేందుకు రఘువీరారెడ్డికి ఆదివారం ఆ గ్రామానికి  వెళ్లారు. ఆ క్రమంలో స్థానిక గ్రామస్తులతో సమావేశమయ్యారు.

అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తుల, ఆ పార్టీ సానుభూతి పరులు... రఘువీరారెడ్డిపై ఇసుక, రాళ్లతో దాడి చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి... టీడీపీ కార్యకర్తలు, సానుభూతిపరులను అదుపులోకి తీసుకున్నారు.

కాగా కోన గ్రామంలో శనివారం స్థానిక శాసనసభ్యుడు, మంత్రి కొల్లు రవీంద్ర, లోక్సభ సభ్యుడు కొనకళ్ల నారాయణ పర్యటించేందుకు వెళ్లారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన గ్రామస్తులు వారిపై దాడికి యత్నించారు. దాంతో వారు పోలీసుల సహాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement