'లాలూ కాళ్లు కడిగించుకున్నారు.. చెప్పులు మోయించాడు' | Probe ordered into police officer washing Lalu Prasad Yadav's feet | Sakshi
Sakshi News home page

'లాలూ కాళ్లు కడిగించుకున్నారు.. చెప్పులు మోయించాడు'

Dec 19 2013 2:27 AM | Updated on Sep 2 2017 1:45 AM

'లాలూ కాళ్లు కడిగించుకున్నారు.. చెప్పులు మోయించాడు'

'లాలూ కాళ్లు కడిగించుకున్నారు.. చెప్పులు మోయించాడు'

ఇప్పటికే పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ పై విడుదలైన లాలూ మరో వివాదంలో కూరుకుపోయారు.

రాంచీ:
ఓ పోలీసుతో పాదాలు కడిగించుకుని, మరో పోలీసుతో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్లిప్పర్లు మోయించినట్టు మీడియాలో వచ్చిన కథనాలపై విచారణకు ఆదేశించారు. పశుగ్రాసం కుంభకోణం కేసులో బిర్సా ముండా సెంట్రల్ జైలు నుంచి బెయిల్ పై విడుదలైన లాలూ ప్రసాద్ యాదవ్ రామ్ ఘర్ లోని రాజ్రప్పా ఆలయంలో పూజలు నిర్వహించారు. 
 
ఆలయంలో లాలూ పాదాలను ఓ పోలీసు కడుగుతున్న.. మరో పోలీసు స్లిప్లర్లు పట్టుకుని ఉన్న ఫోటోలు దినపత్రికల్లో వచ్చాయి. దాంతో బుధవారం  అసెంబ్లీ సమావేశాల్లో లాలూ తీరును ప్రతిపక్షాలు తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశాయి. ఈ సంఘటనకు కారణమైన లాలూ పై పోలీసులు విచారణకు ఆదేశించారు. 
 
ఇప్పటికే పశుగ్రాసం కుంభకోణంలో జైలు శిక్ష అనుభవిస్తూ బెయిల్ పై విడుదలైన లాలూ మరో వివాదంలో కూరుకుపోయారు. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement