'ఢిల్లీలో ఒక నాయుడు.. గల్లీలో ఒక నాయుడు' | our agenda is like that of Maoists agenda, says KTR | Sakshi
Sakshi News home page

'ఢిల్లీలో ఒక నాయుడు.. గల్లీలో ఒక నాయుడు'

Oct 3 2015 10:50 AM | Updated on Sep 3 2017 10:23 AM

'ఢిల్లీలో ఒక నాయుడు.. గల్లీలో ఒక నాయుడు'

'ఢిల్లీలో ఒక నాయుడు.. గల్లీలో ఒక నాయుడు'

మావోయిస్టుల ఎజెండానే తమ ప్రభుత్వ ఎజెండాగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.

వరంగల్:  ఢిల్లీలో ఒక నాయుడు, గల్లీలో ఒక నాయుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మావోయిస్టుల ఎజెండానే తమ ప్రభుత్వ ఎజెండాగా పేర్కొన్నారు.

తుపాకీ మోపలేని తెలంగాణ రాష్ట్రాన్ని తమ ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు.  తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని మండిపడ్డారు.  ప్రజల కోసం అనేక ప్రజాసంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నామని కేటీఆర్ అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement