పెళ్లి కాల్పులలో యువకుడి మృతి | one killed, 2 injured in celebratory firing at wedding | Sakshi
Sakshi News home page

పెళ్లి కాల్పులలో యువకుడి మృతి

Apr 20 2016 2:30 PM | Updated on Sep 18 2019 3:26 PM

పెళ్లి కాల్పులలో యువకుడి మృతి - Sakshi

పెళ్లి కాల్పులలో యువకుడి మృతి

యూపీ, బిహార్ రాష్ట్రాలలో పెళ్లిళ్లంటే.. తప్పనిసరిగా తుపాకుల మోతలు వినిపించాల్సిందే. తాజాగా బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఇలాగే పెళ్లి సందర్భంగా జరిపిన కాల్పులలో 18 ఏళ్ల యువకుడు మరణించగా, మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి.

యూపీ, బిహార్ రాష్ట్రాలలో పెళ్లిళ్లంటే.. తప్పనిసరిగా తుపాకుల మోతలు వినిపించాల్సిందే. తాజాగా బిహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో ఇలాగే పెళ్లి సందర్భంగా జరిపిన కాల్పులలో 18 ఏళ్ల యువకుడు మరణించగా, మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. చౌవా గ్రామంలో జంయ్ రామ్ అనే వ్యక్తి తన సోదరుడి పెళ్లి పార్టీ సందర్భంగా తన లైసెన్సుడు తుపాకితో కాల్పులు జరిపాడు.

దీంతో ఆ బుల్లెట్లు ముగ్గురికి తగిలాయని, వారందరినీ వెంటనే సదర్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ ఒక యువకుడు మరణించాడని జిల్లా కలెక్టర్ వీరేంద్ర ప్రసాద్ యాదవ్ చెప్పారు. మిగిలిన ఇద్దరినీ అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పట్నా మెడికల్ కాలేజి ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉంది. పెళ్లికొడుకు సోదరుడు తన లైసెన్సుడు తుపాకితో సహా అక్కడి నుంచి పారిపోయాడని కలెక్టర్ చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement