
ప్రాధాన్యతా రంగంలోకి మధ్యతరహా యూనిట్ల రుణాలు
ఈ నెల 13 తరువాత మధ్యతరహా తయారీ సంస్థలకు కేటాయించిన రుణాలను ప్రాధాన్యతా రంగంకింద చేర్చుతూ రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది.
ముంబై: ఈ నెల 13 తరువాత మధ్యతరహా తయారీ సంస్థలకు కేటాయించిన రుణాలను ప్రాధాన్యతా రంగంకింద చేర్చుతూ రిజర్వ్ బ్యాంక్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. దీంతోపాటు సూక్ష్మ, చిన్న తరహా యూనిట్లకు ఇచ్చే రుణ పరిమితిని రెట్టింపునకు అంటే రూ. 10 కోట్లకు పెంచుతూ బ్యాంకులకు మార్గదర్శకాలను జారీ చేసింది. వచ్చే ఏడాది మార్చి చివరి వరకూ ఈ ఆదేశాలు అమలు కానున్నాయి. ఈ రెండు మార్పులూ 2014 మార్చి 31 వరకూ అమల్లో ఉంటాయని పేర్కొంది.
విదేశీ డబ్ల్యూఓఎస్ బ్యాంకులకు సీజీటీ మినహాయింపు
దేశంలో పూర్తి స్థాయి అనుబంధ బ్యాంకులుగా (డబ్ల్యూఓఎస్) రూపాంతరం చెందే ప్రస్తుత విదేశీ బ్యాంకు బ్రాంచీలకు ఆర్‌బీఐ ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఈ తరహా డబ్ల్యూఓఎస్‌లపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (సీజీటీ)గానీ లేదా స్టాంప్ డ్యూటీ గానీ విధించడం జరగదని పేర్కొంది.