ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది.
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం ముగిసింది. బుధవారం జరిగిన ఈ సమావేశానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరాలను వెల్లడించారు.
భూసేకరణ బిల్లుకు సవరణలు అవసరమని మెజార్టీ ముఖ్యమంత్రులు అభిప్రాయపడ్డారని జైట్లీ తెలిపారు. 2013 భూసేకరణ చట్టం వల్ల ప్రాజెక్ట్ల అనుమతుల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో భూసేకరణ బిల్లుకు అవసరమైన సవరణలకు ప్రయత్నిస్తామని జైట్లీ తెలిపారు. కాగా ఈ సమావేశానికి చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు గైర్హాజరయ్యారు.