లాభాల్లో దేశీయ సూచీలు | Nifty above 8650, Sensex up over 100 pts; ITC, Maruti, SBI gain | Sakshi
Sakshi News home page

లాభాల్లో దేశీయ సూచీలు

Aug 2 2016 10:05 AM | Updated on Sep 4 2017 7:30 AM

బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగనుందన్న నేపథ్యంలో మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి.

ముంబై : బుధవారం రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై చర్చ జరుగనుందన్న నేపథ్యంలో మంగళవారం నాటి దేశీయ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. దాదాపు 150 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్, ప్రస్తుతం 105.36 పాయింట్ల లాభంతో 28,108 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 27.95 పాయింట్ల లాభంతో 8664 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఐటీసీ,  ఎల్&టీ, మారుతీ సుజుకీ షేర్లలో కొనుగోలు మద్దతు జోరు కొనసాగుతుండటంతో, ఈ షేర్లు మార్కెట్లో లాభాలను పండిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, విప్రోలు నష్టాలను గడిస్తున్నాయి. 8,625 కు 8750 మార్కుకు మధ్య కీలకమైన పరిధిలో నిఫ్టీ నేడు ట్రేడ్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.


మరోవైపు ఆసియన్ మార్కెట్లు మార్నింగ్ సెషన్లో నెగిటివ్ గా ట్రేడ్ అవుతున్నాయి.. అమెరికా మార్కెట్లు సైతం సోమవారం రోజు కిందకే నమోదయ్యాయి. దీంతో గ్లోబల్ ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్లపై పడొచ్చని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అటు డాలర్ తో పోలిస్తే రూపాయి 0.26 పైసలు బలపడి, 66.74గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర స్వల్పంగా పడిపోయి 31,545గా నమోదవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement