కేంద్రమంత్రుల శాఖల్లో కీలక మార్పులు | NDA government reshuffles portfolio's of few ministers | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రుల శాఖల్లో కీలక మార్పులు

Jul 5 2016 10:08 PM | Updated on Sep 4 2017 4:11 AM

కేంద్రమంత్రుల శాఖల్లో కీలక మార్పులు

కేంద్రమంత్రుల శాఖల్లో కీలక మార్పులు

కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మంగళవారం రెండోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేబినేట్ ను విస్తరించింది.

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత మంగళవారం మరోసారి బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం కేబినేట్ ను విస్తరించింది. 19 మంది మంత్రులకు కొత్తగా పదవులను ఇచ్చిన ఎన్డీయే కూటమి,  పలువురు మంత్రుల శాఖలను కూడా మార్చుతూ కీలక నిర్ణయం తీసుకుంది. 19 మంది మంత్రులలో గుజరాత్, రాజస్థాన్ ల నుంచి నలుగురి చొప్పున, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ల నుంచి ముగ్గురి చొప్పున, మహారాష్ట్ర నుంచి ఇద్దరు, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ ల నుంచి ఒక్కొక్కరికి జాబితాలో స్థానం కల్పించారు. కొందరు కేంద్ర మంత్రులను కీలక శాఖల నుంచి సాధారణ శాఖలకు మంత్రులుగా బాధ్యతలు అప్పగించారు.

మానవ వనరులశాఖ మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీని చేనేత, జౌళిశాఖకు మంత్రిగా నియమించింది. ఆమె స్థానంలో ప్రకాశ్‌జవదేకర్‌ను నియమించారు. ఇక కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పట్టణాభివృద్ధి శాఖను అలాగే ఉంచి.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ బాధ్యతల నుంచి మాత్రమే తప్పించారు. ఆ శాఖకు బదులు గృహనిర్మాణం, పట్టణపేదరిక నిర్మూలన, సమాచార, పౌరసంబంధాల శాఖను వెంకయ్యనాయుడుకు అదనంగా కేటాయించారు.

మంత్రులు-శాఖలు
వెంకయ్యనాయుడు- పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణపేదరిక నిర్మూలన, సమాచార, పౌరసంబంధాల శాఖ
స్మృతి ఇరానీ- చేనేత, జౌళీశాఖ
ప్రకాష్ జయదేవకర్- మానవ వనరుల శాఖ
అనంతకుమార్- పార్లమెంటరీ వ్యవహారాల శాఖ
ఎంజే అక్బర్- విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి
రవిశంకర్ ప్రసాద్- న్యాయశాఖ
సదానంద గౌడ- గణాంక శాఖ
బీరేంద్ర సింగ్- గనుల శాఖ
రాందాస్ అథవలే- సామాజిక న్యాయశాఖ
ఇంద్రజిత్ సింగ్- పట్టణాభివృద్ధి హౌసింగ్ పట్టణ దారిద్య్ర నిర్మూలన
అనిల్ మాధవ్ దవే- స్వతంత్రహోదాలో అటవీ పర్యావరణ శాఖ
విజయ్ గోయల్- క్రీడా శాఖ
జశ్వంత్ సిన్హా బాభోర్- గిరిజన వ్యవహారాల శాఖ
జయంత్ సిన్హా- పౌర విమానయాన సహాయమంత్రి
కృష్ణారాజ్- మహిళా శిశు సంక్షేమశాఖ
అర్జున్ మేఘ్ వాల్- ఆర్ధికశాక సహాయమంత్రి
అనుప్రియ పాటిల్‌ - ఆరోగ్య కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement