ఉగ్రవేటను నిలిపివేసిన నేవీ | Navy ends search operations in Uran near Mumbai | Sakshi
Sakshi News home page

ఉగ్రవేటను నిలిపివేసిన నేవీ

Sep 23 2016 7:54 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఉగ్ర అనుమానితుల కోసం నేవీ చేపట్టిన వెతుకులాటను శుక్రవారం సాయంత్రం నిలిపివేసింది.

ఉగ్ర అనుమానితుల కోసం నేవీ  చేపట్టిన వెతుకులాటను శుక్రవారం సాయంత్రం నిలిపివేసింది. ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా నవీ ముంబైలోని ఓ నేవల్ బేస్‌కు సమీపంలో తిరుగుతుండగా తాము చూశామని కొంతమంది విద్యార్థులు గురువారంచెప్పడంతో ఒక్కసారిగా కలకలం రేపిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రవేశించడానికి అవకాశం ఉన్న 91 ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.

ఉగ్రవాదుల ఆచూకీ కోసం ఎన్ఎస్ జీ కమాండోలను కూడా రంగంలోకి దించిన నేవీ అధికారులు సెర్చ్ ఆపరేషన్స్ ను నిలిపివేశారు. వెతుకులాటను అర్ధాంతరంగా రద్దు చేసుకోవడంపై నేవీ ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సివుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement