సెప్టెంబరు 25 నుంచి మైసూరులో దసరా ఉత్సవాలు
విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు నాలుగు వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
బెంగళూరు : విశ్వ విఖ్యాత మైసూరు దసరా ఉత్సవాలను సెప్టెంబరు 25 నుంచి అక్టోబరు నాలుగు వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత గిరీశ్ కర్నాడ్ ఉత్సవాలను ప్రారంభిస్తారు.
విధాన సౌధలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అధ్యక్షతన శనివారం జరిగిన సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు శ్రీనివాస ప్రసాద్, మహదేవ ప్రసాద్, మైసూరు జిల్లా అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.


