జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్ | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్

Published Wed, Jul 29 2015 9:56 AM

జేఎన్‌టీయూ వద్ద ఉద్రిక్తత: నిలిచిన కౌన్సెలింగ్

హైదరాబాద్: వైద్య కళాశాలల్లో పెంచిన ఫీజును వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులు జేఎన్‌టీయూ కళాశాలను ముట్టడించారు. బుధవారం నుంచి జేఎన్‌టీయూలోమెడికల్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అయితే, ఇటీవల ప్రభుత్వం వైద్య కళాశాలల్లో ప్రవేశ ఫీజును పెంచిన విషయం విదితమే. ధనికులకు మాత్రమే వైద్య విద్య అందేలా ప్రభుత్వ విధానం ఉందని ఏబీవీపీ, పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ శ్రేణులు కౌన్సెలింగ్‌ను అడ్డుకునేందుకు యత్నించాయి.

దీంతో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత ఏర్పడింది. విద్యార్థి సంఘాల ఆందోళనతో అధికారులు కౌన్సిలింగ్ ను నిలిపివేశారు. అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే నిలిచిపోయినట్టు కౌన్సిలింగ్ కు వచ్చిన విద్యార్థులు ఆరోపిస్తున్నారు.


Advertisement

తప్పక చదవండి

Advertisement