
పెయింట్ల తయారీలోకి మెరీనా గ్రూప్
రసాయనాలు, వ్యవసాయోత్పత్తుల తయారీలో ఉన్న కొచ్చికి చెందిన మెరీనా గ్రూప్ పెయింట్ల విభాగంలోకి ...
‘పెర్లాక్’ బ్రాండ్‌తో మార్కెట్లోకి...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రసాయనాలు, వ్యవసాయోత్పత్తుల తయారీలో ఉన్న కొచ్చికి చెందిన మెరీనా గ్రూప్ పెయింట్ల విభాగంలోకి ప్రవేశించింది. పెర్లాక్ బ్రాండ్‌తో తొలుత వుడ్ ఫినిషెస్, ఆటోమోటివ్ పెయింట్లను ప్రవేశపెట్టింది. ఏడాదిలో డెకొరేటివ్ పెయింట్ల తయారీలోకి అడుగు పెడతామని పెర్లాక్ పెయింట్స్ మార్కెటింగ్ డెరైక్టర్ లాజర్ ఆంటోనీ తెలిపారు. హైదరాబాద్ మార్కెట్లో ప్రవేశించిన సందర్భంగా ఆదివారమిక్కడ మీడియాతో మాట్లాడారు. ‘మెరీనా గ్రూప్ 1993 నుంచి పెయింట్ల కంపెనీలకు రసాయనాలను సరఫరా చేస్తోంది. పెయింట్ల తయారీకి నెదర్లాండ్ ప్రభుత్వం సాంకేతిక సహకారం అందిస్తోంది.
ఈ ప్రయోజనాలున్నాయి కాబట్టి ఉత్పత్తులు నాణ్యతతోపాటు తక్కువ ధరకు లభిస్తాయి’ అని చెప్పారు. నూతన విభాగానికి మెరీనా గ్రూప్ రూ.30 కోట్లు ఖర్చు చేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ ప్లాంట్లలో రూ.800 కోట్ల విలువైన పెయింట్లను తయారు చేసే సామర్థ్యం ఉంది. జంట నగరాల్లో పెర్లాక్ పెయింట్స్ పంపిణీదారుగా ఉజాలా మార్కెటింగ్ వ్యవహరిస్తుంది.