నర్సుకు మత్తుమందిచ్చి.. ఆపై అత్యాచారం | Man arrested for drugging and raping nurse | Sakshi
Sakshi News home page

నర్సుకు మత్తుమందిచ్చి.. ఆపై అత్యాచారం

Sep 23 2013 1:49 PM | Updated on Jul 28 2018 8:51 PM

ఓ నర్సుకు మత్తుమందు ఇచ్చి, ఆపై ఆమెమీద అత్యాచారం చేసిన కేసులో ఒడిసాలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఓ నర్సుకు మత్తుమందు ఇచ్చి, ఆపై ఆమెమీద అత్యాచారం చేసిన కేసులో ఒడిసాలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కేంద్రపర పట్టణ శివారు ప్రాంతాల్లోని గారాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్తను కోల్పోయిన బాధితురాలు (33) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహార పదార్థం మీద మత్తుమందులు చల్లి తనకు తినిపించారని, ఆ తర్వాత ఈ ఘోరం జరిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
 
శివప్రసాద్ ఆచార్య (52) అనే వ్యక్తి ఆమె పొరుగునే ఉంటాడు. అతడు మొబైల్ ఫోన్లో తాను నగ్నంగా ఉన్నప్పటి ఫొటోలు తీసి.. వాటిని బయటపెడతానని బెదిరించినట్లు ఆమె చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆచార్యను సెక్షన్ 376 (అత్యాచారం), మహిళల పట్ల అసభ్య ప్రవర్తన నిషేధ చట్టాల కింద అరెస్టుచేశారు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించడంతో జ్యుడీషియల్ రిమాండుకు పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement