breaking news
kendrapara
-
కాలకృత్యాలకు వెళ్లి.. మొసలి నోటికి చిక్కి..?
కేంద్రపారా: ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పట్టముండై బ్లాక్ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామంలో మొసలి దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. నదీతీర ప్రాంతాలలో పెరుగుతున్న మొసళ్ల ముప్పుపై స్థానికుల్లో ఆందోళన పెరిగింది. గతంలోనూ ఇలాంటి ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ఆధారాలున్నాయి.మీడియాకు అందిన వివరాల ప్రకారం.. అళపువ పంచాయతీ పరిధిలోని దామోదర్ పట్నా గ్రామానికి చెందిన సుచిత్రా దాస్ సోమవారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నదీతీరానికి వెళ్లారు. ఎంతకీ ఆమె ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనతో పరిసర ప్రాంతాల్లో గాలించారు. నది ఒడ్డున ఆమెకు సంబంధించిన వస్తువులు లభించడంతో.. ఆమెను ఏదైనా మొసలి నీళ్లలోకి లాగికెళ్లి ఉంటుందనే తీవ్ర అనుమానం వ్యక్తమైంది.సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని, నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. సుచిత్రా దాస్ ఆచూకీ కోసం బోట్లు, ప్రత్యేక పరికరాల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. వంటమనిషిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్న సుచిత్రా దాస్.. తన కుటుంబ పోషణకు ఏకైక ఆధారం కావడంతో, ఆమె కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. నదీతీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.ఇది కూడా చదవండి: కర్ణాటక మంత్రివర్గంలో కీలక మార్పులు.. కొత్త మంత్రులు వీరే! -
వరకట్నం: మంచానికి కట్టి, కిరోసిన్ పోసి
సాక్షి, భువనేశ్వర్: ఎన్నో ఊహలతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన ఆ మహిళకు నరకమంటే ఏంటో చూపించారు. భర్త పొట్టకూటి కోసం విదేశం వెళ్లగా సొంత బిడ్డల్లా చూసుకోవాల్సిన అత్తామామలే ఆమెపాలిట యముడిలా తయారయ్యారు. అదనపు కట్నం తేలేదన్న కోపంతో కిరోసిన్ పోసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు. ఈ అమానుష ఘటన శనివారం ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాలు.. ఒడిశాలోని కేండ్రపారా జిల్లాకు చెందిన మహిళకు 2018లో వివాహం జరిగింది. బతుకు దెరువు కోసం ఆమె భర్త ఒమన్ వెళ్లి అక్కడ ప్లంబర్‌గా ఉద్యోగం చేస్తుండగా, ఈ వివాహిత అత్తగారింట్లో ఉంటోంది. ఈ క్రమంలో పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న కానుకలు సరిపోలేదంటూ అత్తింటివారు ఆమెను వేధించుకు తినడం మొదలు పెట్టారు. (నటి రమ్యకు వరకట్న వేధింపులు) దీనికి తోడు భర్త తల్లిదండ్రులతో పాటు అతని ఇద్దరు సోదరీమణులు కూడా కట్నం తీసుకురావాలని ఆమెతో తరచూ గొడవపడేవారు. ఎంతకూ ఆమె వరకట్నం తీసుకురావడం లేదని ఆగ్రహం చెందిన అత్తింటివారు సోమవారం ఆమెను మంచానికి కట్టేసి కిరోసిన్ పోసి తగులబెట్టారు. దీంతో ఆమె అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్లు ఘటనా స్థలానికి చేరుకుని, కటక్‌లోని ఆసుపత్రికి తరలించారు. 60 శాతం గాయాలతో పడి ఉన్న ఆమె ప్రస్తుతం చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటికే నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశారు. బాధితురాలి భర్త మరో సోదరి, ఆమె భర్త పరారీలో ఉన్నారు. చదవండి: బాలుడిపై సామూహిక అత్యాచారం -
భర్త మరణించిన 50 ఏళ్లకు పెన్షన్
దాదాపు పాతికేళ్ల వయసులో భర్త చనిపోయిన ఓ మహిళకు.. అప్పటినుంచి 50 ఏళ్ల తర్వాత.. ఇప్పుడు పెన్షన్ మంజూరైంది. ఈ సంఘటన ఒడిశాలో వెలుగుచూసింది. హరప్రియాదేవి భర్త జానకీనాథ్ నంద చౌదరి ఒడిసా రాజధాని భువనేశ్వర్‌లో గల బీజేపీ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా పనిచేసేవారు. ఆయన కటక్ నగరంలోని జోబ్రా ప్రాంతం వద్ద మహానదిలో మునిగి 1962లో మరణించారు. అప్పటికి ఆయన వయసు 29 ఏళ్లు మాత్రమే. హరప్రియాదేవికి అప్పటికి 26 ఏళ్లు. ఇద్దరు పిల్లలున్నారు. వారిని పోషించడానికి టీచర్ ఉద్యోగం చేశారు. భర్తకు సంబంధించిన పెన్షన్ కోసం అప్పటి నుంచి ఎక్కే మెట్టు, దిగేమెట్టుగా ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు ఆమె రిటైరైపోయారు కూడా. ఆ తర్వాత సైతం పెన్షన్ ఇప్పించాలని ఎందరు అధికారులకు మొరపెట్టుకున్నా అది బధిర శంఖారావమే అయ్యింది. ప్రతియేటా ఉన్నత విద్యాశాఖ డైరెక్టరేట్‌కు వెళ్లడమే ఆమె పని. అయితే.. తన భర్తకు పదేళ్ల సర్వీసు పూర్తి కాలేదు కాబట్టి పెన్షన్ ఇవ్వడం కుదరదన్నారని ఆమె తెలిపింది. అయినా ఆమె మాత్రం పట్టు వదల్లేదు. చివరకు ఒడిసా పెన్షన్ నిబంధనలు మారాయి. ఇన్నేళ్ల తర్వాత ఆమెకు ఇప్పుడు నెలకు ఆరు వేల రూపాయల పెన్షన్ మంజూరుచేశారు. దీంతోపాటు ఇన్నేళ్ల బకాయిల కింద రూ. 6.70 లక్షలు కూడా ఇచ్చారు. ఎట్టకేలకు ఆమెకు పెన్షన్ వచ్చినందుకు సంతోషమని ఉన్నత విద్యాశాఖ మంత్రి బదరీ నారాయణ పాత్ర అన్నారు. -
నర్సుకు మత్తుమందిచ్చి.. ఆపై అత్యాచారం
ఓ నర్సుకు మత్తుమందు ఇచ్చి, ఆపై ఆమెమీద అత్యాచారం చేసిన కేసులో ఒడిసాలో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన కేంద్రపర పట్టణ శివారు ప్రాంతాల్లోని గారాపూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. భర్తను కోల్పోయిన బాధితురాలు (33) ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆహార పదార్థం మీద మత్తుమందులు చల్లి తనకు తినిపించారని, ఆ తర్వాత ఈ ఘోరం జరిగిందని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. శివప్రసాద్ ఆచార్య (52) అనే వ్యక్తి ఆమె పొరుగునే ఉంటాడు. అతడు మొబైల్ ఫోన్లో తాను నగ్నంగా ఉన్నప్పటి ఫొటోలు తీసి.. వాటిని బయటపెడతానని బెదిరించినట్లు ఆమె చెప్పింది. ఆమె ఫిర్యాదు మేరకు ఆచార్యను సెక్షన్ 376 (అత్యాచారం), మహిళల పట్ల అసభ్య ప్రవర్తన నిషేధ చట్టాల కింద అరెస్టుచేశారు. అతడు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించడంతో జ్యుడీషియల్ రిమాండుకు పంపారు.


