వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చర్చలకు సిద్ధం..! | Mallya says ready to talk to banks for one-time settlement | Sakshi
Sakshi News home page

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చర్చలకు సిద్ధం..!

Mar 10 2017 12:50 PM | Updated on Sep 2 2018 5:28 PM

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చర్చలకు సిద్ధం..! - Sakshi

వన్‌ టైం సెటిల్‌మెంట్‌ చర్చలకు సిద్ధం..!

బ్యాంకులతో వన్‌ టైం సెటిల్‌ మెంట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని విజయ్‌ మాల్యా శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.

న్యూఢిల్లీ: బ్యాంకులకు  వేల కోట్ల రుణాలను ఎగవేసిన విదేశాలకు పారిపోయిన  మద్యం వ్యాపారి విజయ్‌ మాల్యా ఎట్టకేలకు దిగి వస్తున్నట్టే కనిపిస్తోంది.  మాల్యాను  విదేశాలనుంచి వెనక్కి రప్పించేందుకు  కేంద్ర ప్రభుత్వం  చేస్తున్న ప్రయత్నాలు, తాజాగా సుప్రీంకోర్టు  కూడా సీరియస్గా స్పందించడంతో  బ్యాంకులతో వన్‌ టైం సెటిల్‌ మెంట్‌కు తాను సిద్ధంగా ఉన్నానని శుక్రవారం ట్విట్టర్‌ ద్వారా ప్రకటించారు.  ఈ మేరకు బ్యాంకులతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానని ట్వీట్‌ చేశారు.
పబ్లిక్ రంగ బ్యాంకులు వన్‌ టైం సెటిల్‌మెంట్‌ విధానాన్ని పాటిస్తూ ఉంటాయని, ఇలా  వందల మంది రుణగ్రహీతలు  తమ  లోన్లను సెటిల్‌ చేసుకున్నారన్నారు.  మరి తనకు ఎందుకు నిరాకరిస్తున్న మాల్యా  ప్రశ్నించారు. గౌరవనీయ సుప్రీంకోర్టులో గణనీయమైన తమ ఆఫర్‌ను పరిగణలోకి తీసుకోకుండా బ్యాంకులు తిరస్కరించాయని  ఆరోపించారు. స్వచ్ఛందంగా ఈ వివాద పరిష్కారంపై మాట్లాడటానికి,  న్యాయబద్ధంగా సెటిల్‌ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని  మాల్యా ట్వీట్ లో చెప్పారు. ఈ వ్యవహారంలో  సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని, ఈ వివాదానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.
అంతేకాదు   ఎలాంటి విచారణ లేకుండా ప్రభుత్వం తనపై ఆరోపణలుగుప్పించినప్పటికీ, ప్రతీ ఒక్క కోర్టు ఆర్డర్‌ ను ఎలాంటి మినహాయింపు లేకుండా  అంగీకరించానంటూ పాత  పల్లవే మళ్ల అందుకున్నారు. సుప్రీం కోర్టులో  అటార్నీ జనరల్  తనపై చేసిన ఆరోపణల్నీ తనకు వ్యతిరేకంగా ప్రభుత్వం వైఖరికి నిదర్శన మన్నారు. 

కాగా  ఉద్దేశపూర్వక రుణ ఎగవేత, పారిశ్రామికవేత్త విజయ్‌ మాల్యాపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుచేయాలని అలాగే డియోజీయో సంస్థ నుంచి పొందిన 40 మిలియన్‌ డాలర్లను డిపాజిట్‌ చేసేలా ఆయనపై చర్యలు తీసుకోవాలని దాఖలైన రెండు వేర్వేరు పిటిషన్లపై తీర్పును అత్యున్నత న్యాయస్థానం– సుప్రీంకోర్టు రిజర్వ్‌ చేసంది.  వడ్డీసహా దాదాపు రూ.9,000 కోట్ల  రుణాల బకాయిల  కేసులో  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియం ఈ పిటిషన్లను దాఖలు చేసింది. గురువారం జరిగిన ఈ కేసు విచారణ సందర్భంగా మాల్యా తరఫు న్యాయవాది సీఎస్‌ వైద్యనాథన్‌పై సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే ఆస్తుల గురించి సరైన వివరాలనే అందించారా అంటూ జస్టిస్‌ ఆదర్స్‌ కుమార్‌ గోయెల్, యూకే లలిత్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం  మాల్యాను ప్రశ్నించింది. అటు బ్యాంకులపైనా కీలక ప్రశ్నల్ని సంధించిన సుప్రీం తీర్పును రిజర్వ్‌ చేసిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement