జస్వంత్ కోసం మృత్యుంజయ యాగం | 'Maha-mratyunjya yagya' for Jaswant in Jaisalmer | Sakshi
Sakshi News home page

జస్వంత్ కోసం మృత్యుంజయ యాగం

Aug 10 2014 2:33 PM | Updated on Sep 2 2017 11:41 AM

జస్వంత్ కోసం మృత్యుంజయ యాగం

జస్వంత్ కోసం మృత్యుంజయ యాగం

కోమాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ కోలువాలని ప్రార్థిస్తూ రాజస్థాన్ లోని జైసల్మేలో మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు.

జైసల్మేర్: కోమాలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పటి బీజేపీ నాయకుడు జస్వంత్ సింగ్ కోలువాలని ప్రార్థిస్తూ రాజస్థాన్ లోని జైసల్మేలో మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు. స్థానిక ముక్తేశ్వర్ మహదేవ్ ఆలయంలో ఈ యాగం చేశారు. జస్వంత్ సింగ్ దీర్ఘష్షు కోసం ఆయన మద్దతుదారులు, సన్నిహితులు ఈ యాగం చేశారని జైసల్మేర్ అభివృద్ధి బ్యాంకు అధ్యక్షుడు పూరన్ సింగ్ బట్టి తెలిపారు.

బైసాకి గ్రామంలో జస్వంత్ అభిమానులు శనివారం ఇలాంటి యాగం చేశారు. ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్, రెఫరల్ ఆసుపత్రిలో కోమాలో ఉన్న జస్వంత్ కు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఢిల్లీలోని తన ఇంట్లో కాలుజారిపడిన జస్వంత్ సింగ్ తలకు తీవ్రమైన గాయంకావడంతో శుక్రవారం మధ్యాహ్నం ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement