సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుమానస్పద మృతి | Lotte Group Vice Chairman Found Dead in Suspected Suicide | Sakshi
Sakshi News home page

సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుమానస్పద మృతి

Aug 26 2016 1:41 PM | Updated on Nov 6 2018 8:51 PM

సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుమానస్పద మృతి - Sakshi

సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుమానస్పద మృతి

దక్షిణ కొరియాకు చెందిన లోటె గ్రూపు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుమానస్పదంగా మృతి చెందాడు.

దక్షిణ కొరియాకు చెందిన లోటె గ్రూపు సీనియర్ ఎగ్జిక్యూటివ్ అనుమానస్పదంగా మృతి చెందాడు. ఆయన కారులో సూసైడ్ నోట్ను పోలీసులు గుర్తించినట్టు లోకల్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. తన కుటుంబం నడిపించే ఓ కంపెనీ నేర విచారణ దర్యాప్తులో భాగంగా న్యాయవాదులు ఆయన్ని ప్రశ్నించిన కొన్ని గంటల్లోనే ఈ ఆత్మహత్య జరిగినట్టు తెలుస్తోంది. తమ గ్రూపు వైస్ చైర్మన్ లీ ఇన్-ఓన్(69) మరణించినట్టు లోటె గ్రూపు కూడా ధృవీకరిస్తూ రిపోర్టర్లకు తెలియజేసింది. అయితే ఆయన ఆత్మహత్యకు గత కారణాలను గ్రూపు వెల్లడించలేదు.

సియోల్లోని వాకింగ్ మార్గంలో లీ మృతదేహాన్ని శుక్రవారం ఉదయం గుర్తించినట్టు లోకల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.  1973 నుంచి లీ గ్రూపులో పనిచేస్తున్నారు. లోటె గ్రూపు అతిపెద్ద బిజినెస్లు లోటె షాపింగ్కు ఆయన సుదీర్ఘకాలంగా సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఓ చెట్టుకు ఆయన ఉరివేసుకుని మృతిచెందినట్టు సేజోంగ్ ఆవరణ పోలీసు స్టేషన్ ఉన్నతాధికారి చెప్పారు. లోటె మృతదేహానికి దగ్గర్లో మెరూన్ గొడుగును పోలీసులు గుర్తించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement