లిస్టింగ్‌ అదరగొట్టిన శంకర బిల్డింగ్‌ | Listing Ceremony of Shankara Building Products Limited | Sakshi
Sakshi News home page

లిస్టింగ్‌ అదరగొట్టిన శంకర బిల్డింగ్‌

Apr 5 2017 10:07 AM | Updated on Sep 5 2017 8:01 AM

హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌, బిల్డింగ్‌ ప్రొడక్టుల సంస్థ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌ బధవారం స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో అట్టహాసంగా లిస్ట్‌ అయింది. ఇష్యూ ప్రైస్‌ పోలిస్తే భారీ ప్రీమయంతో రూ.555 వద్ద ఓపెన్‌ అయింది.

ముంబై: బెంగళూరుకు చెందిన హోమ్‌ ఇంప్రూవ్‌మెంట్‌,  బిల్డింగ్‌ ప్రొడక్టుల సంస్థ శంకర బిల్డింగ్‌ ప్రొడక్ట్స్‌  బధవారం  స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో అట్టహాసంగా లిస్ట్‌ అయింది.  ఇష్యూ  ప్రైస్‌ తో పోలిస్తే  భారీ ప్రీమియంతో రూ.555 వద్ద డెబ్యూ ఎంట్రీ ఇచ్చింది.  అంచనాలకు  తగ్గట్టుకుగానే  25 శాతం పైగా  ప్రీమియంతో దూసుకుపోతోంది.   రూ.ప్రస్తుతం 571 వద్ద పాజిటివ్‌గా ఉంది. కంపెనీ ఎండీ శ్రీ సుకుమార్‌ శ్రీనివాస్‌  తదితరులు  ఈ  కార్యక్రమంలో పాల్గొన్నారు.

 గత నెలలో పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన   ఈ ఐపీవో 41 రెట్లు అధికంగా సబ్‌స్క్రయిబ్‌ అయ్యింది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 440-460గా నిర్ణయించింది.  ఈఐపివో ద్వారా కంపెనీ రూ. 350 కోట్లు సమీకరించింది. ఇష్యూలో భాగంగా కంపెనీ దాదాపు 53 లక్షల షేర్లను ఆఫర్‌ చేయగా..  మొత్తం 22 కోట్ల షేర్లకు బిడ్స్‌ దాఖలయ్యాయి. క్విబ్‌ కోటా దాదాపు 52 రెట్లు, హెచ్‌ఎన్‌ఐల విభాగం నుంచి 91 రెట్లు అధికంగా బిడ్స్‌ దాఖలుకాగా... రిటైల్‌ విభాగం నుంచి ఏకంగా 15 రెట్లకు పైగా దరఖాస్తులు వెల్లువెత్తాయి. గత నెలలో లిస్టయిన ఎవెన్యూ సూపర్‌మార్ట్స్‌(డీమార్ట్‌) ఐపీవో ధరతో పోలిస్తే 110 శాతంపైగా లాభాలను పంచడంతో శంకర బిల్డింగ్‌ ఇష్యూకి రిటైలర్లు క్యూకట్టినట్లు విశ్లేషకులు  భావిస్తున్నారు.

కాగా  దేశవ్యాప్తంగా 103 రిటైల్‌ స్టోర్లను  శంకర రీటైల్‌ కంపెనీ నిర్వహిస్తోంది.  వివిధ రాష్ట్రాలలో మొత్తం 11 ప్రాసెసింగ్‌ కేంద్రాలున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement