మరో నటుడిని ప్రశ్నించనున్న పోలీసులు! | Kerala police to question actor Mukesh | Sakshi
Sakshi News home page

నటి కేసు: మరో ప్రముఖ నటుడు కూడా..!

Jul 12 2017 12:50 PM | Updated on Apr 3 2019 9:11 PM

మరో నటుడిని ప్రశ్నించనున్న పోలీసులు! - Sakshi

మరో నటుడిని ప్రశ్నించనున్న పోలీసులు!

సంచలనం రేపిన ప్రముఖ మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మరో నటుడి పేరు వెలుగులోకి వచ్చింది.

కొచ్చి: సంచలనం రేపిన ప్రముఖ మలయాళ నటి అపహరణ, లైంగిక వేధింపుల కేసులో మరో నటుడి పేరు వెలుగులోకి వచ్చింది. ఈ కేసుకు సంబంధం ఉన్న కేరళకు చెందిన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముకేశ్‌ను ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారు. నటిని అపహరించి.. కారులో లైంగిక వేధించిన ప్రధాన నిందితుడు పల్సర్‌ సుని గతంలో ముఖేశ్‌ డ్రైవర్‌ కావడం గమనార్హం. నటిపై అఘాయిత్యానికి కుట్ర పన్నిన సమయంలోనూ ముఖేశ్ డ్రైవర్‌గా పల్సన్‌ సుని పనిచేసినట్టు పోలీసులు గుర్తించారు. దిలీప్‌ సినిమా 'సౌండ్‌ థోమా' షూటింగ్‌ కొనసాగుతున్న సమయంలో ముఖేశ్‌ డ్రైవర్‌గా సుని ఉన్నాడు.

2013లో ఎర్నాకుళంలో జరిగిన మలయాళ మూవీ ఆర్టిస్ట్స్‌ సంఘం (అమ్మ) షోలోనూ ముఖేశ్‌ డ్రైవర్‌గా సుని హాజరయ్యాడు. ఈ వివరాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ముఖేశ్‌ను ప్రశ్నించాలని నిర్ణయించారు. అంతేకాదు ఈ కేసులో ప్రధాన కుట్రకు కారణంగా భావిస్తున్న నటుడు దిలీప్‌ సోదరుడు అనూప్‌ని కూడా మరోసారి ప్రశ్నించనున్నారు. ఈ కేసులో అరెస్టు అయిన ప్రముఖ మలయాళ నటుడు దిలీప్‌ను రెండురోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. నటుడు దిలీప్‌ దాఖలు చేసిన  బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement