మ్యాగీ నూడుల్స్ను నిషేధించిన కేరళ | Kerala Civil Supplies Corporation bans Maggi Noodles | Sakshi
Sakshi News home page

మ్యాగీ నూడుల్స్ను నిషేధించిన కేరళ

Jun 2 2015 5:15 PM | Updated on Oct 8 2018 4:21 PM

మ్యాగీ నూడుల్స్ను నిషేధించిన కేరళ - Sakshi

మ్యాగీ నూడుల్స్ను నిషేధించిన కేరళ

కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు.

కేరళ రాష్ట్రంలో ఎక్కడా పౌరసరఫరాల కార్పొరేషన్ దుకాణాల్లో మ్యాగీ నూడుల్స్ అమ్మకూడదంటూ నిషేధం విధించారు. మనుషుల ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే కొన్ని రసాయనాలు మోతాదుకు మించి అందులో ఉన్నట్లు తేలడంతో ఈ చర్య తీసుకున్నారు. మ్యాగీ నూడుల్స్ అమ్మకాలను తక్షణం నిలిపివేయాలని కేరళ ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి అనూప్ జాకబ్ పౌరసరఫరాల కార్పొరేషన్కు సూచించారు.

నూడుల్స్ నాణ్యత మీద ఒక స్పష్టత వచ్చేవరకు ఈ నిషేధం కొనసాగుతుందని పైర సరఫరాల కార్పొరేషన్ తెలిపింది. ఇప్పటివరకు అమ్ముడుపోకుండా మిగిలిన నిల్వలను నెస్లె కంపెనీకి తిప్పి పంపేస్తారు. కేరళ పౌరసరఫరాల కార్పొరేషన్కు ఆ రాష్ట్రంలో 1355 ఔట్లెట్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement