వైరల్‌: ఆ నియంతతో టాప్‌ హీరోయిన్‌ ఫొటో! | Katrina Kaif posing with Libyan dictator Gaddafi | Sakshi
Sakshi News home page

వైరల్‌: ఆ నియంతతో టాప్‌ హీరోయిన్‌ ఫొటో!

Jul 10 2017 4:32 PM | Updated on Sep 5 2017 3:42 PM

ఇప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో కత్రినా కైఫ్‌ ఒకరు.

ఇప్పుడు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో కత్రినా కైఫ్‌ ఒకరు. కానీ, ఆమె బాలీవుడ్‌లో అడుగుపెట్టకముందు మోడలింగ్‌ రంగంలో కొనసాగారు. మోడల్‌గా ఆమె గతంలో దిగిన ఫొటోలు, వీడియోలు అప్పుడప్పుడు ఇంటర్నెట్‌లో వెలుగులోకి రావడం పరిపాటే. కానీ ఆమె గతంలో దిగిన ఓ ఫొటో మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్‌ను కుదిపేస్తున్నది. కారణం ఆమెతోపాటు ఆ ఫొటోలో ఉన్నది ఒక కరుడుగట్టిన నియంత.

లిబియాకు చెందిన నియంతృత్వ పాలకుడు మౌమ్మర్‌ గడాఫీతో కత్రినా కైఫ్‌ గతంలో దిగిన ఫొటో ఒకటి ఇప్పుడు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ ఫొటోలో కత్రినతోపాటు సినీ నటులు నేహా ధూపియా, ఆదితి గొవిత్రికర్‌, అంచల్‌ కుమార్‌ తదితరులు ఉన్నారు. గతంలో లిబియాలో ఫ్యాషన్‌ షోలో పాల్గొన్న సందర్భంగా తీసిన ఈ ఫొటోను మోడల్‌ షమితా సింఘా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 'లిబియాలో మనం ఫాషన్‌ షోలో పాల్గొని దాదాపు 15 ఏళ్లు పూర్తవుతున్నది. అప్పుడు గడాఫీని కలిసే అవకాశం దక్కింది. ఈ పర్యటన గుర్తున్నాదా' అంటూ ఆమె కామెంట్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement