
నేడు మీడియా ముందుకు పవన్
కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన ‘కాపు గర్జన’ కార్యక్రమం సందర్భంగా జరిగిన పరిమాణాలపై...
సాక్షి, హైదరాబాద్: కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన ‘కాపు గర్జన’ కార్యక్రమం సందర్భంగా జరిగిన పరిమాణాలపై స్పందించడానికి జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌కల్యాణ్ సోమవారం మీడియా ముందుకు రానున్నారు. కేరళలో సినిమా షూటింగ్‌లో ఉన్న పవన్‌కల్యాణ్ సంఘటన వివరాలు తెలిసిన వెంటనే హైదరాబాద్‌కు పయనమయ్యారని జనసేన పార్టీ కార్యాలయం ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.