ఐవీఆర్‌సీఎల్ నికరనష్టం 155 కోట్లు | IVRCL posts Rs. 155 cr loss in Q4 | Sakshi
Sakshi News home page

ఐవీఆర్‌సీఎల్ నికరనష్టం 155 కోట్లు

Jun 1 2015 4:37 AM | Updated on Sep 3 2017 3:01 AM

ఐవీఆర్‌సీఎల్ నికరనష్టం 155 కోట్లు

ఐవీఆర్‌సీఎల్ నికరనష్టం 155 కోట్లు

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్‌ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్ మార్చితో ముగిసిన నాల్గవ

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్‌ఫ్రా కంపెనీ ఐవీఆర్‌సీఎల్  మార్చితో ముగిసిన నాల్గవ త్రైమాసికంలో రూ. 155 కోట్ల నికరనష్టాన్ని చవిచూసింది. అయితే గతేడాది ఇదేకాలంలో నమోదుచేసుకున్న రూ. 328 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాల్ని కంపెనీ తగ్గించుకోగలిగింది.  తాజా సమీక్షాకాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 1,217 కోట్ల నుంచి రూ. 1,027 కోట్లకు తగ్గింది. 2014-15 పూర్తి సంవత్సరానికి రూ. 3,117 కోట్ల ఆదాయం రూ. 672 కోట్ల నష్టం వచ్చింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మార్చితో ముగిసిన ఏడాదికి రూ. 3,819 కోట్ల ఆదాయంపై రూ. 1,556 కోట్ల నష్టాన్ని నమోదుచేసింది. ప్రస్తుతం రూ. 19,244 కోట్ల విలువైన ఆర్డర్లు వున్నట్లు కంపెనీ  విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
 

Advertisement
 
Advertisement
Advertisement