ఇక పోస్టల్ ఏటీఎంలు:తపాలా శాఖ | India Post to install 3000 ATMs | Sakshi
Sakshi News home page

ఇక పోస్టల్ ఏటీఎంలు:తపాలా శాఖ

Jan 26 2014 8:04 PM | Updated on Sep 2 2017 3:02 AM

పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి శుభవార్త.

ముంబై: పోస్టాఫీసుల్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి శుభవార్త. ఇకపై పోస్టాఫీసుల్లో కూడా ఏటీఎంలు రాబోతున్నాయి. వచ్చే ఏడాది సెప్టెంబర్‌కల్లా దేశవ్యాప్తంగా మూడు వేల ఏటీఎంలు, లక్షా 35 వేల మైక్రో ఏటీఎంలు నెలకొల్పాలని తపాలా శాఖ యోచిస్తోందని ఆ శాఖ కార్యదర్శి పద్మినీ గోపీనాథ్ వెల్లడించారు. ఫిబ్రవరి 5న న్యూఢిల్లీ, చెన్నై, బెంగళూరుల్లో ఒక్కో ఏటీఎం ప్రారంభిస్తున్నామని, క్రమంగా వాటిని దేశమంతా విస్తరిస్తామని ఆమె ఆదివారం ఇక్కడ విలేకరులతో చెప్పారు.

 

ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందించడానికి సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్‌తో భారత తపాలా శాఖ ఒప్పందం కుదుర్చుకుంది.  మైక్రో ఏటీఎంలు చేతిలో ఇమిడిపోయే పరికరం. దీనిని పోస్టాఫీసు స్థాయిలో ఉపయోగించవచ్చు. ఇక ఏటీఎంలు వాణిజ్య బ్యాంకుల ఏటీఎంల మాదిరిగానే పనిచేస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement