'తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి' | Increase number of Assembly seats in Telangana region to 153: Marri Sashidhar Reddy | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి'

Nov 28 2013 11:11 AM | Updated on Aug 29 2018 8:20 PM

'తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి' - Sakshi

'తెలంగాణలో అసెంబ్లీ సీట్లు 153కు పెంచాలి'

నూతనంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్కు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి విజ్ఞప్తి చేశారు.

నూతనంగా ఏర్పాటవుతున్న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్కు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఉదయం శశిధర్ రెడ్డి న్యూఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ను కలుసుకున్నారు.

 

ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయని, వాటి సంఖ్యను 153కు పెంచాలని ఆయన దిగ్విజయ్ను కోరారు. అసెంబ్లీ స్థానాల పెంపు అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని దిగ్విజయ్ సింగ్ ఈ సందర్బంగా భరోసా ఇచ్చారని శశిధర్ రెడ్డికి చెప్పారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement