రూ.13 లక్షల అవినీతికి రూ.75 లక్షల జరిమానా! | Health ministry ex-officer jailed for graft | Sakshi
Sakshi News home page

రూ.13 లక్షల అవినీతికి రూ.75 లక్షల జరిమానా!

Dec 3 2013 2:47 AM | Updated on Sep 22 2018 8:22 PM

రూ. 13 లక్షల అవినీతికి రూ. 75 లక్షల జరిమానా విధించి స్థానిక సీబీఐ కోర్టు సంచలనం సృష్టించింది.

న్యూఢిల్లీ: రూ. 13 లక్షల అవినీతికి రూ. 75 లక్షల జరిమానా విధించి స్థానిక సీబీఐ కోర్టు సంచలనం సృష్టించింది. 17 ఏళ్ల కిందటి ఈ కేసులో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. అవినీతి ఏ స్థాయిలో జరిగినా ఉపేక్షించడం సరికాదని, అది దేశాభివృద్ధినే అడ్డుకోగలదని సోమవారం వ్యాఖ్యానించింది.  ఆరోగ్య, కుటుంబ సంరక్షణ శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్ జనరల్(ఏడీజీ) హోదాలో పనిచేసిన విశ్వ విభూతి(67) ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారని సీబీఐ 1996లో కేసు నమోదు చేసింది.
 

Advertisement
 
Advertisement
Advertisement