గురుదాస్పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు | Gurdaspur attack: slain SP, 2 Punjab policemen get top gallantry medal | Sakshi
Sakshi News home page

గురుదాస్పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు

Aug 14 2015 6:34 PM | Updated on Sep 3 2017 7:27 AM

గురుదాస్పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు

గురుదాస్పూర్ దాడి: పోలీసులకు సాహస పతకాలు

పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఎస్పీ బల్జీత్ సింగ్, సాహసోపేతంగా పోరాడిన మరో ఇద్దరు పోలీసులకు అత్యున్నత పోలీసు మెడల్స్ ఇవ్వనున్నారు.

పంజాబ్లోని గురుదాస్పూర్లో పాకిస్థాన్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన ఎస్పీ బల్జీత్ సింగ్, సాహసోపేతంగా పోరాడిన మరో ఇద్దరు పోలీసులకు అత్యున్నత పోలీసు మెడల్స్ ఇవ్వనున్నారు. ఇన్స్పెక్టర్ బల్బీర్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ తారా సింగ్ ఈ దాడి జరిగిన సమయంలో పోలీసు స్టేషన్లో ఉన్నారు. వాళ్లు ఉగ్రవాదులను అణిచేయడంలో మంచి సమయస్ఫూర్తి, ధైర్య సాహసాలు ప్రదర్శించారు. దాంతో వారికి కూడా పతకాలు ప్రకటించారు.

బల్జీత్ సింగ్కు రాష్ట్రపతి పోలీసు పతకాన్ని ప్రకటించారు. బల్జీత్ సింగ్ తండ్రి కూడా కొన్నేళ్ల క్రితం ఉగ్రవాదులతో పోరాడుతూ ప్రాణాలు వదిలారు. పాకిస్థాన్ నుంచి వచ్చిన లష్కరే తాయిబా లేదా జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఓ బస్సు మీద కూడా కాల్పులు జరిపి, తర్వాత దీనానగర్ పోలీసు స్టేషన్లోకి చొచ్చుకెళ్లారు. ఈ దాడిలో ముగ్గురు పౌరులు, బల్జీత్ సింగ్, ముగ్గురు హోం గార్డులు మరణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement