'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' | Sakshi
Sakshi News home page

'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు'

Published Mon, Feb 13 2017 9:42 AM

'తమిళనాడులో సీఎం పదవి ఖాళీలేదు' - Sakshi

బెంగళూరు : తమిళనాడులో నెలకొన్న రాజకీయ సంక్షోభంలో బీజేపీ ఎలాంటి జోక్యం చేసుకోదంటూ స్పష్టీకరించిన వెంకయ్యనాయుడు మరోసారి ఆ విషయంపై స్పందించారు. ఆ రాష్ట్ర గవర్నర్ రాజ్యాంగ అధినేతగా తన బాధ్యతలను నిష్ఫక్షపాతంగా నిర్వహిస్తున్నారని చెప్పారు. ఎలాంటి విషయాలు ఆయన్ని ప్రభావితం చేయడం లేదన్నారు. తమిళనాడులో ముఖ్యమంత్రి పదవి ఖాళీ లేదని, అక్కడ ముఖ్యమంత్రి అధినేతగా ఉన్న ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు.  అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభంపై పార్టీ నేతలే ఓ సరియైన నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు.
 
తమిళ సంక్షోభాన్ని త్వరగా ముగించేందుకు  గవర్నర్ విద్యాసాగర్‌రావు వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఓ వైపు నుంచి ఆయనపై ఒత్తిడి నెలకొంటోంది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ గవర్నర్కు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఇప్పటికే ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాలపై స్పందించిన వెంకయ్యనాయుడు ఎలాంటి పక్షపాతం లేకుండా గవర్నర్ వ్యవహరిస్తారని వెంకయ్యనాయుడు చెప్పారు.  పన్నీర్సెల్వం రాజీనామా చేయడానికి బీజేపీ కారణం కాదని స్పష్టీకరించారు. బీజేపీ తమిళ అసెంబ్లీలో ఓ సభ్యురాలు కాదని, తమకు అక్కడ ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి ఎలాంటి అవకాశమూ లేదన్నారు.   బెంగళూరులో జరిగిన  ఓ ఈవెంట్లో వెంకయ్యనాయుడు ఆదివారం పాల్గొన్నారు.. 

Advertisement
 
Advertisement