170 కోట్ల యాడ్స్పై నిషేధం | Google banned 1.7 billion 'misleading' ads in 2016: Report | Sakshi
Sakshi News home page

170 కోట్ల యాడ్స్పై నిషేధం

Jan 27 2017 4:46 PM | Updated on Sep 5 2017 2:16 AM

170 కోట్ల యాడ్స్పై నిషేధం

170 కోట్ల యాడ్స్పై నిషేధం

ఆన్లైన్ యూజర్లకు హానిచేస్తున్న తప్పుడు వ్యాపార ప్రకటనలపై గూగుల్ కొరడా ఝళిపించింది.

న్యూఢిల్లీ : ఆన్లైన్ యూజర్లకు హానిచేస్తున్న తప్పుడు వ్యాపార ప్రకటనలపై గూగుల్ కొరడా ఝళిపించింది. 2016లో 170 కోట్లకు పైగా యాడ్లను బ్యాన్ చేసినట్టు గూగుల్ పేర్కొంది. అక్రమ ఉత్పత్తులతో పిచ్చిపిచ్చి ఆఫర్లు గుప్పిస్తూ యూజర్లను తప్పుదోవ పట్టిస్తున్న, ప్రమోట్ చేస్తున్న యాడ్లపై కొరడా ఝళిపించినట్టు శుక్రవారం గూగుల్ ప్రకటించింది.
 
వార్షిక 'బెటర్ యాడ్స్ రిపోర్ట్' లో ఈ విషయాన్ని వెల్లడించింది. ప్రీ, ఓపెన్ వెబ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు మంచి సాధనం. కానీ తప్పుడు ప్రకటనలు ఆన్లైన్లో యూజర్లను విసుగిస్తున్నాయి. యూజర్లకు ఇవి హానికరంగా మారుతున్నాయని స్కాట్ స్పెన్సార్ సస్టైనబుల్ యాడ్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ తెలిపారు.
 
తప్పుదోవ పట్టించే యాడ్స్, దోపిడి విధానపరమైన ఆఫర్ల నుంచి యూజర్లను రక్షించేందుకు తమ పాలసీలను విస్తరిస్తామని గూగుల్ పేర్కొంది. తప్పుడు ప్రకటనలు త్వరలోనే కనుమరుగవుతాయని చెప్పింది. హైల్త్ కేర్ ఉల్లంఘనల్లో 68 మిలియన్ చెత్త ప్రకటనలను, గాంబ్లింగ్ ఉల్లంఘనల్లో 17 మిలియన్ ప్రకటనలను గూగుల్ బ్యాన్ చేసిందని ఈ రిపోర్టు వివరించింది. బరువు తగ్గింపు స్కాంకు పాల్పడుతున్న ఉత్పత్తులను ప్రమోట్ చేస్తున్న 47వేల సైట్లపై గూగుల్ గతేడాది చర్యలు తీసుకుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement