గరుడవేగ దివాళి ఆఫర్స్.. | GarudaVega & GarudaBazaars - Diwali Offers | Sakshi
Sakshi News home page

గరుడవేగ దివాళి ఆఫర్స్..

Oct 15 2016 11:30 AM | Updated on Sep 4 2017 5:19 PM

గరుడవేగ, గరుడ బజార్ తన వినియోగదారులకు దీపావళి ఆఫర్స్ ప్రకటించింది.

అంతర్జాతీయ సరుకు రవాణాసంస్థ గరుడవేగ, గరుడ బజార్ తన వినియోగదారులకు ఈ దీపావళి సౌభాగ్యం, సుఖసంతోషాలతో వెల్లివెరియాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపింది. అమెరికా, యూకే, యూఏఈ, యూరప్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మధ్య ప్రాచ్య దేశాలతో పాటు, 200 దేశాల్లో సేవలందిస్తున్న ఈ సంస్థ, దీపావళి ఆఫర్స్ ప్రకటించింది. పండుగకి ఇంటికి వెళ్లడానికి మిస్ అయిన ప్రవాస భారతీయ కుటుంబసభ్యుల్లో ఆనందం నింపడానికి వారి కోసం గిప్ట్లను, నోరూరించే స్నాక్స్, స్వీట్స్ను వారి స్వదేశానికి పంపనుంది. స్పెషల్ దివాళి కింద కొన్ని రిటర్న్ గిప్ట్లపై 20 శాతం డిస్కౌంట్ ఇవ్వనుంది. కూపన్ కోడ్ కింద అదనంగా 5 శాతం డిస్కౌంట్ను వినియోగదారులు పొందవచ్చని తెలిపింది.  
 
ఎన్‌ఆర్‌ఐలకు అవసరమైన అన్ని వస్తువులను వేగంగా, నమ్మకంగా డెలివరీ చేస్తూ గరుడావేగ కస్టమర్ల మనన్నలు పొందుతోంది. అతి తక్కువ ధరలకే విదేశాలకు గిప్ట్ ప్యాకెట్లను పంపిస్తోంది. అంతర్జాతీయంగా(భారత్ నుంచి విదేశాలకు, అమెరికా నుంచి భారత్కు), అమెరికా దేశీయ రూట్లలో గరుడవేగ ఎక్స్ప్రెస్ షిప్పింగ్ ఆఫర్లను అందిస్తోంది. అదేవిధంగా సముద్రాల్లో కూడా ఎక్కువ మొత్తంలో సరుకులను రవాణా చేస్తూ విశిష్ట సేవలందిస్తోంది. గణేష్ చతుర్థి ఉత్సవాల సందర్భంగా అమెరికాలోని ప్రముఖ దేవాలయాలకు 10 అడుగుల గణేష్ విగ్రహాన్ని, 100 కేజీల లడ్డూలను ఈ రవాణా సంస్థ తరలించింది.తమ సేవలను మరింత మెరుగుపరుచుకోవడానికి వినియోగదారులు నుంచి గరుడవేగ సలహాలు సూచనలను అభ్యర్థిస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement