'తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదు' | G Kishan reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదు'

Nov 19 2015 12:29 PM | Updated on Sep 3 2017 12:43 PM

'తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదు'

'తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదు'

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు.

వరంగల్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో నేనెక్కడికి పారిపోలేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సాగరహారంలో పాల్గొన్నారా అంటూ కేసీఆర్ను ప్రశ్నించారు. వరంగల్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా గురువారం వరంగల్లో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అలాగే సకల జనుల సమ్మెకు వెన్నుపోటు పొడిచిందెవరు అని కేసీఆర్ను ఆయన నిలదీశారు.

కేసీఆర్ ఊహాలోకంలో విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా  కేసీఆర్ ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఈ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తుందని విమర్శించారు.  
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement