పట్టపగలే నాలుగు హత్యలు!! | Four daylight murders in Thane | Sakshi
Sakshi News home page

పట్టపగలే నాలుగు హత్యలు!!

Mar 17 2014 4:08 PM | Updated on Sep 2 2017 4:49 AM

మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఒకేరోజు పట్టపగలు నాలుగు హత్యలు జరిగాయి. హతుల్లో ఇద్దరు గృహిణులు కూడా ఉన్నారు.

మహారాష్ట్రలోని థానె జిల్లాలో ఒకేరోజు పట్టపగలు నాలుగు హత్యలు జరిగాయి. హతుల్లో ఇద్దరు గృహిణులు కూడా ఉన్నారు. గంగ్రిపాద ప్రాంతంలో ఐదారుగురు వ్యక్తులు పాతికేళ్ల యువకుడిపై పదునైన ఆయుధాలతో దాడి చేశారు. కరెంటు స్తంభానికి కొట్టేసి మరీ ఈ ఘాతుకానికి పాల్పడటంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. మరో మూడు సంఘటనలు థానె పోలీసు కమిషనరేట్ పరిధిలో జరిగాయి. కాన్ గ్రామంలో 32 ఏళ్ల తరన్నుమ్ అస్లాంఖాన్ అనే మహిళను ఆమె భర్త చంపేసి, గోనెసంచిలో శవాన్ని కట్టేసి, ఓ పైప్లైను వద్ద విసిరేశాడు.

బద్లాపూర్ రైల్వేస్టేషన్ వద్ద రాత్రి 10.40 గంటల ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ఏజెంటు ఒకరిని కాల్చిచంపారు. సంతోష్ సాల్వి తన స్నేహితుడితో కలిసి మద్యం తాగుతుండగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. వెంటనే మహేంద్ర భాగుల్ అనే ఆ స్నేహితుడు కాల్చిచంపాడు. లవ్కుశ్ హౌసింగ్ సొసైటీ ప్రాంతంలో నివిసించే పూనమ్ గజ్రానీ అనే మహిళను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. గ్యాస్ సిలిండర్తో ఆమె తలపై మోది, కత్తులతో పొడిచి, గొంతుకు వైరు బిగించి మరీ చంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement