పైన పేర్కొన్న అభ్యర్థులు ఎవరూ కాదు (నోటా)’ అనే ఆప్షన్‌కు కొత్త చిహ్నాన్ని ఎలక్షన్ కమీషన్ ఆమోదించింది.
న్యూఢిల్లీ: పైన పేర్కొన్న అభ్యర్థులు ఎవరూ కాదు (నోటా)’ అనే ఆప్షన్‌కు కొత్త చిహ్నాన్ని ఎలక్షన్ కమీషన్ ఆమోదించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకుంటే ఓటర్లకు తిరస్కరించే హక్కును కల్పించిన కేంద్ర ఎన్నికల సంఘం తొలిసారిగా ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దీన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది. తెల్ల కాగితంపై ‘నన్ ఆఫ్‌ద ఎబోవ్(నోటా)’ అని ఆంగ్లంలో పెద్ద అక్షరాలతో ముద్రించి ఉంటుంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తుతోపాటు దీన్ని కూడా ముద్రిస్తారు.
‘నోటా’ పేరుతో దీనికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’ అని ఢిల్లీ ఎన్నికల కమిషన్ ప్రధాన నోడల్ అధికారి అంకుర్ గర్గ్ చెప్పారు.