మహారాష్ట్రలోని షోలాపూర్ లో సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు.
షోలాపూర్: మహారాష్ట్రలోని షోలాపూర్ లో సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు. గాయత్రి ట్రావెల్స్ కు చెందిన బస్సు బోల్తా పడడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. షిరిడీ నుంచి విజయవాడకు తిరిగొస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కల్వర్ట్ ను ఢీకొనడంతో బస్సు బొల్తాపడింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు మహిళలతో సహా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులు కృష్ణా జిల్లా చిలకలపూడి చుట్టుపక్కల గ్రామస్థులుగా గుర్తించారు. గాయపడిన 20 మందిని సమీపంలోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 50 మందిపైగా ఉన్నట్టు తెలుస్తోంది.