గౌరీలంకేశ్‌ హత్యపై దిగ్భ్రాంతి | Editors Guild condemns killing of Gauri Lankesh | Sakshi
Sakshi News home page

గౌరీలంకేశ్‌ హత్యపై దిగ్భ్రాంతి

Sep 6 2017 2:19 PM | Updated on Sep 17 2017 6:29 PM

గౌరీలంకేశ్‌ హత్యపై దిగ్భ్రాంతి

గౌరీలంకేశ్‌ హత్యపై దిగ్భ్రాంతి

ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

  • తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు
  • సర్వత్రా పెల్లుబుక్కుతున్న నిరసన
  • న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్‌ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా జరిగిన ఆమె హత్యపై పాత్రికేయ లోకం భగ్గుమంటోంది. ఆమెను కాల్చిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు.

    గౌరీలంకేశ్‌ హత్యను ఐండియన్‌ జర్నలిస్ట్‌ యూనియన్‌ (ఐజేయూ) ఖండించింది. గౌరీ హత్య ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలని పేర్కొంది. ఇలాంటి దాడులను జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ సిన్హా, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్‌ పిలుపునిచ్చారు.

    గౌరీలంకేశ్‌ హత్యపై ఎడిటర్స్ గిల్డ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి.. అసమ్మతి వాదాన్ని వినిపించిన ఆమెను హత్య చేయడమంటే.. భావప్రకటనా స్వేచ్ఛపై కిరాతకంగా దాడిచేయడమేనని ఎడిటర్స్‌ గిల్డ్‌ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement