10 నిమిషాలకే.. 20 కేజీలు తగ్గాడు
బరువు తగ్గాలంటే ఎంతో తీవ్రంగా కష్టపడాలని చాలా మంది చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా కేవలం రోజుకు 10 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేసి 20 కేజీల బరువు తగ్గించుకున్నట్లు పాతికేళ్ల అమెరికన్ పాప్ సింగర్ ఎడ్ షీరాన్ తెలిపారు.
బరువు తగ్గాలంటే ఎంతో తీవ్రంగా కష్టపడాలని చాలా మంది చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా కేవలం రోజుకు 10 నిమిషాలు మాత్రమే వ్యాయామం చేసి 20 కేజీల బరువు తగ్గించుకున్నట్లు పాతికేళ్ల అమెరికన్ పాప్ సింగర్ ఎడ్ షీరాన్ తెలిపారు. రోజూ పది నిమిషాల పాటు వ్యాయామాన్ని క్రమం తప్పకుండా పాటించడమే ఇందులో ఉన్న రహస్యమని ఆయన చెప్పారు. మధ్యమధ్యలో మానేస్తూ రోజుకు గంటలు గంటలు చేయడం కంటే, ప్రతిరోజూ తప్పనిసరిగా పది నిమిషాలు చేస్తే ఫలితం వచ్చిందన్నాడు.
పిజ్జాలు, బీర్లకు దూరంగా ఉండటం కూడా ఒక ముఖ్యవిషయమని వెల్లడించారు. పది నిమిషాల్లోనే మంచి ఫలితం ఇచ్చే హై ఇంటెన్సిటీ వర్కవుట్లను తన ప్రియురాలు చెర్రి సీబోర్న్ సూచించిందని తెలిపాడు. బరువు తగ్గిన తరువాత తన దుస్తులు అన్ని లూజైపోయాయాని ముసిముసి నవ్వులతో తెలిపాడు.