శ్రీనగర్‌లో 38 చోట్ల రీ పోలింగ్ | EC Orders Repoll at 38 Polling Stations in Srinagar Constituency | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో 38 చోట్ల రీ పోలింగ్

Apr 11 2017 8:22 PM | Updated on Aug 14 2018 4:34 PM

శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు.

న్యూఢిల్లీ: శ్రీనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఈ నెల 13న 38 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఆదివారం జరిగిన శ్రీనగర్ ఉప ఎన్నికల్లో భారీగా హింస, అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

కాల్పుల్లో ఎనిమిది మంది పౌరులు మరణించగా, 100 మందికి పైగా భద్రత సిబ్బంది గాయపడ్డారు. ఈ ఎన్నికల్లో 6.5 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. గత మూడు దశాబ్దాలలో ఇదే అతి తక్కువ ఓటింగ్. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారులు, పరిశీలకుల నుంచి నివేదికలు తెప్పించుకున్న ఈసీ 38 పోలింగ్ స్టేషన్ల పరిధిలో రీ పోలింగ్‌ నిర్వహించాలని జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం అధికారిని ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement