కన్యత్వ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు | Doctors were caught performing virginity tests on girls in Sweden | Sakshi
Sakshi News home page

కన్యత్వ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు

Oct 16 2015 12:25 PM | Updated on Sep 3 2017 11:04 AM

కన్యత్వ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు

కన్యత్వ పరీక్షలు చేస్తూ దొరికిపోయారు

కన్యత్వ పరీక్షలు చేస్తూ స్వీడన్ వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. యుక్త వయసు వచ్చిన వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పరీక్షలు చేస్తూ కెమెరాకు చిక్కారు.

స్వీడన్: కన్యత్వ పరీక్షలు చేస్తూ స్వీడన్ వైద్యులు అడ్డంగా దొరికిపోయారు. యుక్త వయసు వచ్చిన వారికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఈ పరీక్షలు చేస్తూ కెమెరాకు చిక్కారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. స్వీడన్లో గత కొంతకాలంగా డాక్టర్లు అనుమానాస్పద కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. తమకు ఇష్టం లేకపోయినా వైద్యులు కన్యత్వ పరీక్షలు నిర్వర్తిస్తున్నారని యువతులు ఆరోపణలు చేస్తుండటంతో ఈ మేరకు ఓ కోవర్టు ఆపరేషన్ నిర్వహించారు. రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్లో స్వీడన్ వైద్యులు ఏ విధంగా ఈ కార్యక్రమాలకు పాల్పడుతున్నారో బయటపడింది.

స్వీడన్కు చెందిన కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ కల్లా కఫ్తా(కోల్డ్ ఫ్యాక్ట్) సంస్థ రహస్యంగా ఈ ఆపరేషన్ నిర్వహించింది. ముందుగా కొన్ని ఆస్పత్రులకు వెళ్లిన అండర్ కవర్ జర్నలిస్టులు ఆయా ఆస్పత్రులలో సీసీ కెమెరాలు అమర్చారు. అనంతరం ఓ మహిళా జర్నలిస్టు ఓ 17 ఏళ్ల బాలికను తీసుకెళ్లి కన్యత్వ పరీక్షలు చేసి సర్టిఫికెట్ ఇవ్వాలని వైద్యులను కోరింది. కానీ, ఆ బాలిక నిరాకరిస్తుండగానే వైద్యులు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతూ కెమెరా కళ్లకు చిక్కారు.

కన్యత్వ పరీక్షలు, అది కూడా ఇష్టం లేకుండా వైద్యులు చేసే కన్యత్వ పరీక్షలు చేయడం స్వీడన్ చట్టం గట్టిగా వ్యతిరేకిస్తుంది. అయినా, ఆ చట్టాన్ని లెక్కచేయకుండా వయోభేదం లేకుండా బాలికలకు కూడా వైద్యులు కన్యత్వ పరీక్షలు ఇప్పటికే నిర్వహించినట్లు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఈ విషయం తెలిసి స్వీడన్ ప్రభుత్వ వర్గాలు అవాక్కయ్యాయి. ఎందుకంటే మహిళ హక్కుల సాధనకోసం కృషి చేసే ప్రపంచ దేశాల్లో స్వీడన్ కూడా ముందు వరుసలో ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement