‘దివాకర్‌’ బస్సే.. మా ఇంటి దీపాలను ఆర్పేసింది | Diwakar travels are the responsibility for the tragedy: Victims families | Sakshi
Sakshi News home page

‘దివాకర్‌’ బస్సే.. మా ఇంటి దీపాలను ఆర్పేసింది

Mar 6 2017 4:25 AM | Updated on Apr 6 2019 8:55 PM

‘దివాకర్‌’ బస్సే.. మా ఇంటి దీపాలను ఆర్పేసింది - Sakshi

‘దివాకర్‌’ బస్సే.. మా ఇంటి దీపాలను ఆర్పేసింది

‘మాయదారి దివాకర్‌ బస్సే మా ఇంటి దీపాలను ఆర్పేసింది..’ అంటూ కృష్ణా జిల్లా నంది గామ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు.

నందిగామ ప్రమాదంలో మృతి చెందిన కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డి తల్లిదండ్రుల ఆవేదన
గరిడేపల్లి: ‘మాయదారి దివాకర్‌ బస్సే మా ఇంటి దీపాలను ఆర్పేసింది..’ అంటూ కృష్ణా జిల్లా నంది గామ వద్ద రోడ్డు ప్రమాదంలో మరణించిన నలబోలు కృష్ణారెడ్డి, శేఖర్‌రెడ్డిల తల్లిదండ్రులు శేషిరెడ్డి, కమలమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కోదండరాంపురంలో వారు మీడి యాతో మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే..

‘మా పిల్లలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారని ఎంతో సంబరపడ్డాం. కానీ బస్సు ప్రమాదం మా పిల్లలిద్దర్నీ బలితీసుకుంది. డ్రైవర్‌ నిర్లక్ష్యం మా పిల్లలను కానరాని లోకాలకు పంపింది. ప్రైవేట్‌ బస్సులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా ప్రభు త్వాలు పట్టించుకోకపోవడం దారుణం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పి ఆధార్‌కార్డులు, బ్యాంకు అకౌంట్లు తీసుకెళ్లారు. ఎవరెంత పరిహారం చెల్లించినా మా పిల్లల ప్రాణాలు మాకు తిరిగి ఇవ్వగలరా? మా పిల్లల చావుకు కారణమైన బస్సు యాజమాన్యంపై చర్యలు తీసుకోకుండా ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం సరికాదు. మా పిల్లల ప్రాణాలను బలిగొన్న బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

వైఎస్‌ జగన్‌పై కేసు తగదు
ప్రమాదంలో మరణించిన మహ్మద్‌ తయ్యబ్‌ భార్య రషీదాబేగం  
హైదరాబాద్‌: రోడ్డు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టడం సరికాదని ఆ ప్రమాదంలో మరణించిన హైదరాబాద్‌కు చెందిన మహ్మద్‌ తయ్యబ్‌ భార్య రషీదా బేగం అన్నారు. ఆదివారమిక్కడ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదానికి కారణమైన దివా కర్‌ ట్రావెల్స్‌ యాజమాన్యంపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఏపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతో వ్యవహరిస్తుంది తప్ప బాధితులను పట్టించుకోవడం లేదని మండి పడ్డారు. ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తే దివాకర్‌ ట్రావెల్స్‌ యజమానులైన జేసీ సోదరులపై తామే కేసు పెడతామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement