కేసీఆర్నే అడగండి: దిగ్విజయ్ | Digvijay Singh Welcomes Seemandhra Congress MPs Expel | Sakshi
Sakshi News home page

కేసీఆర్నే అడగండి: దిగ్విజయ్

Feb 11 2014 6:09 PM | Updated on Aug 15 2018 9:17 PM

కేసీఆర్నే అడగండి: దిగ్విజయ్ - Sakshi

కేసీఆర్నే అడగండి: దిగ్విజయ్

అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు.

న్యూఢిల్లీ: ప్రభుత్వానికి వ్యతిరేకంగా లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినందుకే ఆరుగురు సీమాంధ్ర ఎంపీలను పార్టీ నుంచి బహిష్కరించామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా వారు వినలేదని చెప్పారు. అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడం పార్టీ వ్యతిరేక చర్య అని అన్నారు.

ఎంపీల బహిష్కరణ సబబే అని ఆయన సమర్థించారు. తాము పార్టీ నుంచి మాత్రమే బయటకు పంపామని, పార్లమెంట్‌ సభ్యులను బహిష్కరించడం స్పీకర్ పరిధిలోని అంశమని చెప్పారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదని దిగ్విజయ్ సింగ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీలో టీఆర్‌ఎస్‌ విలీనం గురించి కేసీఆర్‌నే అడగాలని సూచించారు. ఢిల్లీలో కేసీఆర్ అన్నిపార్టీల నేతలను కలుస్తున్నారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement