మా రసాయన ఆయుధాలను అప్పగిస్తాం: సిరియా | Could Syria hand in chemical weapons and avoid strikes? | Sakshi
Sakshi News home page

మా రసాయన ఆయుధాలను అప్పగిస్తాం: సిరియా

Sep 11 2013 3:00 AM | Updated on Sep 1 2017 10:36 PM

సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది.

మాస్కో/వాషింగ్టన్: సిరియా సంక్షోభానికి పరిష్కారం దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది. మిత్రదేశమైన రష్యా ప్రతిపాదన ప్రకారం, తమ రసాయనిక ఆయుధాలను అంతర్జాతీయ సమాజ నియంత్రణలోకి తెచ్చేందుకు సిరియా అంగీకరించింది. తమపై అమెరికా దూకుడును తిప్పికొట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం ప్రకటించింది. రసాయనిక ఆయుధాలను అప్పగిస్తే సిరియాపై దాడిని నిలిపివేస్తామని అమెరికా అధ్యక్షుడు ఒబామా చెప్పిన కొన్ని గంటల్లోనే సిరియా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఆయుధాల అంశంపై మంగళవారం రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో జరిపిన చర్చలు ఫలప్రదమయ్యాయని సిరియా విదేశాంగ మంత్రి వాలిద్ అల్ మోలెమ్ మాస్కోలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement