పాము 'తలే' ప్రాణం తీసింది! | Chopped off snake head bites chef, kills | Sakshi
Sakshi News home page

పాము 'తలే' ప్రాణం తీసింది!

Aug 23 2014 8:12 PM | Updated on Sep 2 2017 12:20 PM

పాము 'తలే' ప్రాణం తీసింది!

పాము 'తలే' ప్రాణం తీసింది!

పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు.

చైనా:పాము తలను మొండెం నుంచి వేరు చేశాడు. ఆ మాంసాన్ని వంటకు సిద్ధం చేశాడు. అయితే ఆ వేరు చేసిన తల ప్రాణంతోనే ఉన్నదన్న సంగతి మరిచాడు. అలా చేయడమే అతని ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ తాజా నమ్మశక్యం కాని ఘటన చైనాలోని ఫోషన్ నగరంలోని కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే..  ఒక చెఫ్ త్రాచు పామును మాంసాహారంగా చేయడం కోసం ఒక కత్తితో ఆ పాము తలను, మొండాన్ని వేరు చేశాడు.

 

ఇక వంటకు సిద్ధం అయ్యే క్రమంలో ప్రక్కనే ఉన్న పాము తలను చెత్తబుట్టలో పాడేయడానికి వెళ్లాడు. అయితే ఆ పాము తల మాత్రం అప్పటికీ ఊపిరితోనే ఉంది. అది ఆ చెఫ్ ను కాటువేయడంతో అతను కొద్దిపాటి సమయంలోనే ప్రాణాలు కోల్పోయాడు.ఇటువంటి ఘటనలు అరుదుగా జరిగినా.. పాము తలను వేరుచేసిన గంట తరువాత కూడా బ్రతికే ఉంటాయనేది ఇక్కడ గమనించాల్సిన విషయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement