వెరైటీగా ప్రపోజ్ చేశాడు! | Chinese man proposes with diapers instead of diamonds | Sakshi
Sakshi News home page

వెరైటీగా ప్రపోజ్ చేశాడు!

Nov 3 2015 2:22 PM | Updated on Aug 13 2018 3:35 PM

వెరైటీగా ప్రపోజ్ చేశాడు! - Sakshi

వెరైటీగా ప్రపోజ్ చేశాడు!

ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా తెలిపాడో ప్రేమికుడు. వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడో చైనా లవర్.

బీజింగ్: ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా తెలిపాడో ప్రేమికుడు. వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడో చైనా లవర్. డైమండ్ రింగ్ బదులుగా డైపర్స్ తో తన ప్రేమను వ్యక్తం చేశాడు. 50పైగా డైపర్ ప్యాక్స్ తో ప్రపోజ్ చేశాడని స్థానిక మీడియా వెల్లడించింది.

గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన ఫెంగ్ రెండేళ్ల పాటు తన ప్రియురాలితో ప్రేమాయణం సాగించాడు. ఆమె నెల తప్పిందని తెలుసుకుని తన ప్రేమను వెరైటీగా తెలపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. తన స్నేహితుల సహాయంతో 4500 డైపర్లు కొని వీటిని 50 బ్యాగుల్లో పెట్టి హృదయాకారంలో ప్యాక్ చేశాడు.

పెర్ల్ నది ఒడ్డున తన ప్రియురాలికి దీన్ని బహూకరించి ప్రేమను వ్యక్తం చేశాడు. అంతేకాదు మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. డ్రోన్ సహాయంతో మరో డైపర్ బ్యాగ్ ను ఆమెకు అందించాడు. ఇది ఓపెన్ చేయగానే ఫెంగ్ ప్రియురాలి ముఖం సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోయింది. డైపర్ బ్యాగ్ లోపల డైమండ్ రింగ్ పెట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు.

'ఈరోజు నుంచి నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నా' అని ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే అంగీకరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement