‘తేనె’ మనసు.. మనిషి | Chinese man covered with 460000 bees for honey selling stunt | Sakshi
Sakshi News home page

‘తేనె’ మనసు.. మనిషి

Apr 11 2014 3:18 AM | Updated on Sep 2 2017 5:51 AM

తేనె అమ్ముకునే ఈ వ్యక్తికి తేనె కంటే తేనెటీగలంటే మహా ప్రేమ. ఖాళీ సమయమంతా వీటి మధ్యే గడుపుతాడు.

తేనె అమ్ముకునే ఈ వ్యక్తికి తేనె కంటే తేనెటీగలంటే మహా ప్రేమ. ఖాళీ సమయమంతా వీటి మధ్యే గడుపుతాడు. గత 12 ఏళ్లుగా వీటితోనే సావాసం. తేనె వ్యాపారానికి కొత్త తరహా ప్రచారం తేవాలనే ఆలోచన, తేనెటీగలతో సావాసమే.. ఈ సాహసానికి పురికొల్పాయంటాడు ఈయన. ఈశాన్య చైనాలోని చోంగ్‌క్వింగ్ నగరంలో నివసించే ఈయన పేరు షి పింగ్(34).

సాహసం చేసేసమయంలో కనీసం షర్ట్ కూడా వేసుకోని ఈయనపై దాదాపు 4,60,000 తేనెటీగలు దాదాపు 40 నిమిషాలపాటు అలాగే ఉండిపోయాయి. ఈ తేనెటీగల మొత్తం బరువు దాదాపు 45 కేజీలు. గతంలో ఇదేతరహాలో మొత్తంగా 61.4 కేజీల బరువైన లక్షలాది తేనెటీగలతో భారత్‌కు చెందిన విపిన్ సేథ్ గిన్నిస్ ప్రపంచ రికార్డును సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement