రాష్ట్రంలో శిశువిక్రయాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పేదరికంతో భారమైన తమ పిల్లలను కన్న తల్లిదండ్రులే అమ్ముకుంటున్న ఘటనలు రాష్ట్రంలో ఏదోఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి.
మెదక్: రాష్ట్రంలో శిశువిక్రయాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పేదరికంతో భారమైన తమ పిల్లలను కన్న తల్లిదండ్రులే అమ్ముకుంటున్న ఘటనలు రాష్ట్రంలో ఏదోఒకచోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆస్పత్రి ఖర్చు చెల్లించలేక తమ ఇద్దరి కవల పిల్లలను అమ్ముకున్న ఘటన జరిగిన రెండురోజులకే తాజాగా మరో శిశు విక్రయ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.
పేదరికంతో కన్నతల్లిదండ్రులు తమ కూతుర్ని 2,500 రూపాయలకు అమ్ముకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటన శిశుసంక్షేమశాఖ మంత్రి సునీతా మండలంలో చోటుచేసుకున్నట్టు సమాచారం.