చంద్రబాబుకు కోపం వచ్చింది.. | chandra babu naidu gets angry over women groups | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు కోపం వచ్చింది..

Jul 31 2015 4:01 PM | Updated on Jul 28 2018 6:48 PM

చంద్రబాబుకు కోపం వచ్చింది.. - Sakshi

చంద్రబాబుకు కోపం వచ్చింది..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి కోపం వచ్చింది. డ్వాక్రా రుణమాఫీ సంగతి ఏం చేశారంటూ తనను ప్రశ్నించిన మహిళలపై ఆయన ఒక్కసారిగా మండిపడ్డారు. విజయవాడలో ఉన్న సీఎం చంద్రబాబుని మహిళా సంఘాల ప్రతినిధులు శుక్రవారం కలిశారు. వాళ్లు రుణమాఫీ గురించి ప్రస్తావించగానే ఒక్కసారిగా మహిళలపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళల నుంచి కనీసం వినతిపత్రం కూడా తీసుకోకుండానే ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. దాంతో సీఎం వ్యవహార శైలిపై మహిళా సంఘాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. విషయం తెలిసి...  నాలుక కరుచుకున్న చంద్రబాబు, నిరసన తెలుపుతున్న మహిళల వద్దకు వచ్చి సమస్యలు పరిష్కరిస్తానని వారికి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement