బరిలో బాబాయి vs అబ్బాయి! | Chacha-Bhatija battle in Kalyanpur | Sakshi
Sakshi News home page

బరిలో బాబాయి vs అబ్బాయి!

Oct 8 2015 7:06 PM | Updated on Jul 18 2019 2:11 PM

ఇటు బాబాయి- అటు అబ్బాయి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకారు

కళ్యాన్పూర్: ఇటు బాబాయి- అటు అబ్బాయి. గెలుపే లక్ష్యంగా ఎన్నికల బరిలోకి దూకారు. పోటాపోటీగా తలపడుతున్నారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బాబాయి-అబ్బాయి పోరు ఆసక్తికరంగా మారింది.

ఎల్జేపీ అధినేత రాంవిలాస్ పాశ్వాన్కు బంధువులైన ప్రిన్స్ రాజ్ (26), మాజీ ఎంపీ మహేశ్వర్ హజారి (44) కళ్యాన్పూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీకి దిగారు. ప్రిన్స్ రాజ్ ఎల్జేపీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుడగా, హజారి జేడీయూ నుంచి పోటీకి దిగారు. కళ్యాన్పూర్ జేడియూ ఇలాకా అయినప్పటికీ, వరుసకు బాబాయి- అబ్బాయిలు అయిన ఈ ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ప్రిన్స్ రాంవిలాస్ పాశ్వాన్ తమ్ముడు రాంచంద్ర పాశ్వాన్ కొడుకు. రాంచంద్ర పాశ్వాన్ 2014 లోక్సభ ఎన్నికల్లో హజారిని చిత్తుగా ఓడించారు. ఇప్పుడు ఆయన కొడుకుతో తలపడుతున్న హజారి విజయం కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement