గ్రామీణ మహిళలకు ‘స్వయం’ ఉపాధి | Centre's New Scheme To Give Interest-Free Commercial Vehicle Loan To Women In Villages | Sakshi
Sakshi News home page

గ్రామీణ మహిళలకు ‘స్వయం’ ఉపాధి

Jun 15 2017 10:44 AM | Updated on Sep 5 2017 1:42 PM

మహిళలు చిన్నపాటి వాణిజ్యవాహనాలు సొంతం చేసుకునేలా కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది.

న్యూఢిల్లీ : గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు చిన్నపాటి వాణిజ్యవాహనాలు సొంతం చేసుకునేలా కేంద్రం సరికొత్త పథకాన్ని తీసుకురానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని రవాణా వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు మహిళలకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ‘ప్రధానమంత్రి గ్రామ్‌ పరివాహన్‌ యోజన’(పీఎంజీపీవై)ను ఆగస్టు 15న ప్రారంభించనున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మీడియాకు తెలిపారు.

తొలిదశలో భాగంగా 1,500 వాణిజ్య వాహనాలను కొనుగోలు చేయడానికి కేంద్రం స్వయం సహాయక బృందాల(ఎస్‌హెచ్‌జీ)కు వడ్డీ లేని రుణాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. పది సీట్ల సామర్థ్యమున్న వాహనాలకు రుణం కింద గరిష్టంగా రూ.6 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement