'పూర్తి మెజార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్' | Centre will work shoulder-to-shoulder with new Har govt says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'పూర్తి మెజార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్'

Oct 21 2014 7:24 PM | Updated on Sep 2 2017 3:13 PM

'పూర్తి మెజార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్'

'పూర్తి మెజార్టీ ఇచ్చినందుకు థ్యాంక్స్'

హర్యానా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు.

చండీగఢ్: హర్యానా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని కేంద్ర మంత్రి ఎం. వెంకయ్య నాయుడు చెప్పారు. హర్యానా పురోభివృద్ధికి కేంద్రం అన్నివిధాలా సహకరిస్తుందని హామీయిచ్చారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున ఇక్కడ కూడా తమ ప్రభుత్వం రావాలని హర్యానా ప్రజలు కోరుకున్నారని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెట్టిన హర్యానా ప్రజలకు వెంకయ్య కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం జరిగిన హర్యానా బీజేపీ ఎమ్మెల్యేల సమావేశానికి కేంద్ర పరిశీలకుడిగా ఆయన హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement