
మూర్ఖంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కారు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.
కోల్కతా: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు. మోడీ సర్కారు మూర్ఖంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మహిళనని కూడా చూడకుండా తనపై బాధ్యతారాహిత్య, అసభ్య పదజాలంతో దాడి చేస్తోందని వాపోయారు.
బీజేపీ అనుసరిస్తున్న అహంకారధోరణి, బాధ్యతారహిత ప్రవర్తన ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెస్తోందన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుంటే చూస్తూ ఊరుకోమని మమతా బెనర్జీ అన్నారు. తన రాజకీయ జీవితం పోరాటాలు, త్యాగాలతో కూడుకుందన్నారు.